సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

15న బాల్‌ బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక మట్టి కుప్పలు సీజ్‌

శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్‌

హుస్నాబాద్‌: సాధారణ విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని శాతవాహన యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఉమేశ్‌కుమార్‌ అన్నారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ట్యాలీ ఈఆర్‌పీ సాంకేతిక పరిజ్ఞానంపై నిర్వహించిన వర్క్‌షాపు ముగింపు సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కేవలం డిగ్రీ పట్టాలు కలిగి ఉంటే ఉపాధి అవకాశాలు పొందలేరన్నారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని, కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలని తెలిపారు. పరిశోధనా రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉన్నత విధ్యాభ్యాసం ద్వారా విద్యార్థులు పరిశోధనా రంగాలను ఎంచుకోవాలని సూచించారు. శిక్షణ పొందిన విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ భిక్షపతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి

మిరుదొడ్డి(దుబ్బాక): హమాలీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి కోరారు. ఈ మేరకు గురువారం మిరుదొడ్డి తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హమాలీ కార్మికులకు కనీసం వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు. 50 ఏళ్లు నిండిన ప్రతి హమాలీకి రూ.6 వేల పెన్షన్‌ అందించాలన్నారు. విధి నిర్వహణలో మరిణించిన కార్మికుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించాలన్నారు. హమాలీ కార్మికుల హక్కుల సాధన కోసం ఈ నెల 24న తలపెట్టిన జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ మద్దెల అంజయ్య, హమాలీ కార్మికులు లింగం, భిక్షపతి, చంద్రం, పోచయ్య, యాదయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

మిరుదొడ్డి(దుబ్బాక): సబ్‌ జూనియర్‌ అండర్‌ 15 బాల్‌ బ్యాడ్మింటన్‌ జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 15న బీహెచ్‌ఈఎల్‌ ఓల్డ్‌ ఎంఐజీలో ఎంపిక చేయనున్నట్లు ఉమ్మడి మెదక్‌ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భైరయ్య, జనరల్‌ సెక్రటరీ పీవీ రమణ తెలిపారు. గురువారం వారు మిరుదొడ్డిలో మాట్లాడుతూ ఎంపిక కోసం వచ్చే క్రీడాకారులు ఆధార్‌, బోనాఫైడ్‌ జీరాక్స్‌లతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తెచ్చుకోవాలని కోరారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడా టీంలు ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా వాణి విద్యానికేతన్‌ హై స్కూల్‌, సంకల్ప్‌ వెల్ఫేర్‌ గ్రౌండ్‌ రామచంద్రాపురంలో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 97047 46511 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

మద్దూరు(హుస్నాబాద్‌): కొండాపూర్‌, కూటిగల్‌ గ్రామాల్లోని చెరువు, కుంటల్లోంచి అక్రమంగా తవ్వి నిల్వ చేసిన మట్టి డంప్‌లను సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ శ్యామ్‌ తెలిపారు. ఇటుక బట్టీల కోసం అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. తవ్వకాలను నిలిపి వేయడంతో పాటు కొండాపూర్‌లో ఒకటి, కూటిగల్‌లో నాలుగు డంప్‌లను సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. ఏపీకి చెందిన చెన్నకేశవులు, నర్సింహరావులు అక్రమంగా మట్టిని తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement