గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రిలో ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రిలో ఇష్టారాజ్యం

Aug 10 2026 7:20 AM | Updated on Aug 10 2026 7:20 AM

వైద్యులు, సిబ్బంది కనుసన్నల్లోనే వ్యవహారం ఒక్కో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ నుంచి ఒక్కో బ్రోకర్‌ నియామకం ఎంపీ ఆకస్మిక తనిఖీ.. వైద్యాధికారులపై ఫైర్‌

గజ్వేల్‌ జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షల పేరుతో నిలువుదోపిడీ జరుగుతోంది. ఆస్పత్రిలోరెఫరల్‌ దందా.. మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎంపీ రఘునందన్‌రావుఆదివారం ఇక్కడ చేపట్టిన ఆకస్మిక తనిఖీలో ఎన్నో అంశాలు వెలుగు చూశాయి. పట్టణంలోని ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్లనిర్వాహకులు ఒక్కొక్కరూ.. ఒక్కో బ్రోకర్‌ను నియమించుకొని రోగులను తమవైపు తిప్పుకుంటూ, స్కానింగ్‌లు, ఇతరముఖ్యమైన వైద్య పరీక్షల పేరిట రోగులను దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా వైద్యాధికారులు పట్టించుకోకపోవడంగమనార్హం. – గజ్వేల్‌

జ్వేల్‌లోని జిల్లా ఆస్పత్రి పనితీరుపై విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆస్పత్రిలో వైద్య సేవలపై ఈనెల 3న ‘సాక్షి’లో ‘ఆస్పత్రికి సమస్యల సుస్తీ’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెల్సిందే. ఈ కథనంలో వైద్యులు, సిబ్బంది కుమ్మకై ్క స్కానింగ్‌లు, ఎక్స్‌రేల కోసం రోగులను ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు పంపుతున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. తాజాగా ఆదివారం మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఆస్పత్రిని తనిఖీ చేసిన సందర్భంగా మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రిలో రెఫరల్‌ దందా సాగుతున్నా.. కట్టడి చేయాల్సిన వైద్యాధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు ఈ అంశంపై ప్రభుతాసుపత్రిలో బ్రోకర్ల సంచారం నిజమేని ఒప్పుకున్నారు. తాము అలాంటి వ్యక్తులను ప్రశ్నిస్తే.. బంధువులను చూడటానికి వచ్చినట్లు చెబుతున్నారని ఎంపీకి వివరించారు. ఇకనుంచి ఆస్పత్రిలో సీసీ టీవీ ఫుటేజీలను నిత్యం పరిశీలించి, రెఫరల్‌ దందా కారకులపై చర్యలు తీసుకోవాలని, బ్రోకర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో తానూ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

సెంటర్‌కో బ్రోకర్‌

స్థానిక జిల్లా ఆస్పత్రి పరిధిలోని ఎంసీహెచ్‌ (మాతా శిశుసంరక్షణ ఆస్పత్రి)లో 100పడకలు, సాధారణ ఆస్పత్రిలో మరో 100 పడకలు ఉన్నాయి. నిత్యం ఈ రెండు ఆస్పత్రులకు 500–700కుపైగా ఓపీ ఉంటుంది. ఇక్కడికి గజ్వేల్‌ నియోజకవర్గంలోని రోగులేకాకుండా సరిహద్దుల్లో ఉన్న సంగారెడ్డి, మెదక్‌, జనగామ, యాదాద్రి జిల్లాలకు చెందిన రోగులకు వస్తుంటారు. కానీ రోగుల అవసరాల ఆసరాగా చేసుకొని నిలువుదోపీడీ చేస్తున్నారు. ఎంసీహెచ్‌లో టిఫా స్కానింగ్‌, గ్రోతింగ్‌ స్కానింగ్‌, అల్ట్రా సౌండ్‌ లాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా చాలావరకు వీటిని బయట డయాగ్నోస్టిక్‌ సెంటర్లకే రాస్తూ రెఫరల్‌ ‘దందా’కు తెర తీశారు. ఇకపోతే జనరల్‌ ఆసుపత్రిలో ఎక్స్‌రే, ఈసీజీ లాంటి పరికరాలు అందుబాటులో ఉన్నా.. వీటితోపాటు స్కానింగ్‌లను బయటకే రాస్తున్నారు. గాయాలతో వచ్చే వారిని ఎక్స్‌రేల కోసం ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్ల చుట్టూ తిప్పుతూ దండుకుంటున్నారు. ఒక్కో డయగ్నోస్టిక్‌ సెంటర్‌ నుంచి ఒక్కో బ్రోకర్‌ను జీతమిచ్చి మరీ పెట్టుకొని రోగులను తమవైపు తిప్పుకుంటున్నారు. విపరీతంగా కమీషన్లు పంచుకుంటున్నారు. వైద్యులు, సిబ్బంది కనుసన్నల్లోనే ఈ ‘దందా’ యథేచ్ఛగా సాగుతోంది.

వైద్య పరీక్షల పేరుతో నిలువుదోపిడీ

గజ్వేల్‌ జిల్లా ఆస్పత్రిలోని జనరల్‌, ఎంసీహెచ్‌ విభాగాల్లో పనిచేస్తున్న ఎక్కువమంది వైద్యులు, సిబ్బందికి బయట ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లుఉండటమే ఈ ‘దందా’కు మూల కారణమని స్పష్టమవుతోంది. ముందుగా ఇక్కడ పనిచేస్తున్న వారిని కట్టడి చేయడంతోపాటు ప్రేవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్ల నుంచి వస్తున్న బ్రోకర్‌లను గుర్తించి క్రిమినల్‌ చర్యలు తీసుకోగలిగితేనే పరిస్థితి గాడిన పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement