కాశిరెడ్డిపల్లి గ్రామస్తులతో మాజీ సీఎం కేసీఆర్
మర్కూక్(గజ్వేల్): మండల పరిధిలోని కాశిరెడ్డిపల్లి సమస్యల పరిష్కారానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీఇచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ శాసన సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కర్మకు కేసీఆర్ ఆదివారం తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి వెళ్తున్న క్రమంలో కాశిరెడ్డిపల్లి వద్ద గ్రామ యువకులు అభివాదం చేయడంతో తన కాన్వాయిని ఆపారు. గ్రామస్తులతో కారులోంచి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సమస్యలు విన్నవించుకున్నారు. ఇటీవల సాక్షిలో నాడు కళకళ.. నేడు వెలవెల శీర్షికన కల్యాణమండపం దుస్థితిపై ప్రచురితమైన కథనాన్ని సైతం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. వెంటనే సానుకులంగా స్పందించిన కేసీఆర్.. అధికారులతో మాట్లాడి గ్రామ సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారని గ్రామస్తులు తెలిపారు.


