హుస్నాబాద్: మంత్రులకు సోమవారం కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి ఎల్కతుర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కొద్ది సేపు ఆగారు. కాంగ్రెస్ నాయకులు వారికి శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి మంత్రి పొన్నం కాంగ్రెస్ నాయకులను పరిచయం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి మంత్రులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వడ్డెపల్లి వెంకట రమణ, మండల అద్యక్షుడు వెన్న రాజు తదితరులు ఉన్నారు.


