కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు స్వామివారి నామస్మరణతో మారుమోగాయి. ఉదయమే క్షేత్రానికి చేరుకున్న భక్తులు అభిషేకాలు, నిత్యకల్యాణం, ప్రత్యేకపూజలు చేశారు. పట్నాలు వేసి, గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు, ప్రధానార్చకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్..
మల్లికార్జున స్వామిని ఆదివారం రాష్ట్ర ట్రెజరీ అకౌంట్స్ డైరెక్టర్ పార్వతీదేవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదం, శేషవస్త్రాలు అందించారు. కార్యక్రమంలో డీటీఓ చంద్రు, ఎస్‌టీఓ నర్సింహులు, ఆలయ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
సిద్దిపేటరూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజావాణి కార్యక్రమాన్ని బోనాల పండుగ దృష్ట్యా నేటి సోమవారం ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఆతర్వాత సోమవారం యథావిధిగా ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు.


