ఏ ట్యాంక్ అయినా తరచూగా శుభ్రం చేసుకోవాలి. సంవత్సరానికి రెండు నుంచి మూడు మార్లు బ్లీచింగ్ చేయాలి. ట్యాంక్‌లలో నిల్వ ఉండే నీటినే దినచర్యలో వినియోగిస్తాం. వాటర్ ట్యాంక్‌లు శుభ్రంగా ఉంచుకోకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలుంటాయి.
– డాక్టర్ మధన్‌మోహన్, మైక్రోబయాలజీ విభాగాధిపతి, ప్రభుత్వ డిగ్రీ,
పీజీ కళాశాల, సిద్దిపేట
సిమెంట్ ట్యాంకుల్లోనే
నాచు ఎక్కువ
సిమెంట్ ట్యాంక్‌లలో నాచు ఎక్కువగా వస్తుంది. అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టిక్ ట్యాంకులు తక్కువ కెమికల్‌తో తయారు చేసేవి వినియోగిస్తే మంచిది.
– తిప్పర్తి రేష్మ, విద్యార్థిని, ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ ఫైనల్ ఇయర్


