పకడ్బందీగా ‘సర్’ ప్రక్రియ
సిద్దిపేటరూరల్: పారదర్శక ఓటరు జాబితాను తయారు చేయడమే ‘ఎస్‌ఐఆర్’ ముఖ్య ఉద్దేశ్యమని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా స్పెషల్ అబ్జర్వర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, బీఎల్‌ఓలతో అబ్జర్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం నాణ్యమైన ఓటర్ జాబితా తయారు చేయడమే అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటరు అతి ముఖ్యమైన పాత్ర వహిస్తారని అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ చేపట్టి బోగస్ ఓటర్లు లేకుండా పరిపూర్ణమైన ఓటర్ జాబితాను సిద్ధం చేస్తోందన్నారు. ఓటర్లను గుర్తించేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని క్షేత్రస్థాయిలో రెండు, మూడు సార్లు పరిశీలించి పక్కింటి వారి సంతకం తీసుకొని నిర్ణయానికి రావాలన్నారు. సేకరించిన వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి ఎస్‌ఐఆర్ ప్రక్రియ వివరాలను తెలియజేశారు. జిల్లాలో వందశాతం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునఃపరిశీలన పూర్తయిందని తెలిపారు. 87.97 శాతం ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, బి ఎల్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.
పంద్రాగస్టు వేడుకలు వైభవంగా నిర్వహించాలి
జిల్లాలో పంద్రాగస్టు వేడుకలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సిద్దిపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వచ్చే అతిథులు, విద్యార్థులు, ప్రజలు సౌకర్యవంతంగా కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం పోలీస్ పరేడ్ నిర్వహణ, ముఖ్య అతిథి ప్రసంగం, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై వివిధ శాఖల ద్వారా శకటాల ప్రదర్శన, స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి కార్యాలయం సిబ్బంది తప్పక పాల్గొనాలని సూచించారు.
ఉమ్మడి జిల్లా స్పెషల్ అబ్జర్వర్ గౌరవ్ ఉప్పల్
కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం


