ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేతన్ గోరేకర్
సిద్దిపేటకమాన్: ప్రతీ కుటుంబం క్రమం తప్పకుండా డబ్బులు పొదుపు చేయడం ఎంతో అవసరమని ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేతన్ గోరేకర్ సూచించారు. జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో స్వయం సహాయక సంఘాల గ్రూప్ లీడర్లకు ఆర్థిక అక్ష్యరాస్యత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చేతన్ గోరేకర్ మాట్లాడుతూ..బ్యాంకులలో లభించే వివిధ పొదుపు పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు తమ పొదుపులను సురక్షితమైన బ్యాంకింగ్ వ్యవస్థలో ఉంచడం ద్వారా ఆర్థిక భద్రతను పెంపొందించుకోవచ్చని సూచించారు. జిల్లా సైబర్ క్రైమ్ డీఎస్పీ రాజు మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం పిన్, ఓటీపీ, బ్యాంక్ పాస్‌వర్డ్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడద న్నారు.


