సిద్దిపేటరూరల్: మై భారత్ పోర్టల్‌పై జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదే శించారు. జిల్లాలోని యువతకు మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా వివిధ జాతీ య, రాష్ట్రస్థాయి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు. జిల్లాలో మై భారత్ ఇంటెన్సివ్ నమోదు, అవగాహన డ్రైవ్ జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని, పాఠశాలలు, కళాశాలలు,క్రీడాకారులు యువజన సంఘాల, భాగస్వామ్యంతో ఈ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
సీ్త్రనిధి రుణాలు వందశాతం రికవరీ
జిల్లాలో సీ్త్రనిధి రుణాల కింది మహిళలు తీసుకున్న రుణాల చెల్లింపులు వచ్చే అక్టోబర్ నెల చివరికల్లా రికవరీ చేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఐకేపీ, సీ్త్రనిధి, మెప్మా సిబ్బందితో రుణాల రికవరీపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్రనిధి ఫండ్స్‌ను తప్పుగా వినియోగించిన వీవోఏలు వారం రోజుల్లోగా చెల్లించకపోతే వారిని తొలగిస్తామన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
తొగుట(దుబ్బాక): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి స్థానిక కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పాఠశాలను రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. బాలికలతో మాట్లాడి బోధన, ఆహారం గురించి ఆరాతీశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కలెక్టర్‌ను కోరారు. డీపీఓతో ఫోన్‌లో మాట్లాడి పాఠశాల ఆవరణతో పాటు రోడ్డుకు రెండు వైపులా లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాలను తరచూ పర్యవేక్షించాలని తొగుట ఎస్‌ఐ నవీన్‌కు సూచించారు.


