వర్గల్(గజ్వేల్): గ్రామీణ కూలీలకు, రైతులకు కడుపునింపుతున్న ఉపాధిహామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి విమర్శించారు. వర్గల్, తున్కిఖాల్సా తదితర గ్రామాలలో సోమవారం ఉపాధిహామీ కూలీలతో విధానసభలు ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును దుర్బుద్ధితో వీబీజీ రాంజీగా మార్చారని, కేంద్ర నిధుల్లో కోత విధించేందుకు 60, 40శాతం కేంద్ర, రాష్ట్ర నిధులంటున్నారని ఎద్దేవా చేశారు.జాతీయ ఉపాధి హామీ చట్టం రద్దుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఉపాధి హామీ కూలీలతో విధాన సభలు, సమావేశాలు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి, మోహన్, వెంకటేష్, యాదగిరి, నర్సారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి


