సిద్దిపేటరూరల్: కన్న కొడుకులే ఇంట్లో నుంచి గెంటేయడంతో కలెక్టర్‌కు చెప్పుకుందామని సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావానికి చేరుకున్నారు. కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు జంగం మల్లయ్య, ఎల్లవ్వలు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వారికి ఉన్న వ్యవసాయ భూమిని పెద్ద కుమారుడు జంగం యాదయ్యకు 30 గుంటలు, రెండో కుమారుడు జంగం కుమార్‌కు 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం తమను పట్టించుకోకుండా ఇంటి నుంచి వెళ్లగొట్టారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం నుంచి వారు కిరాయి ఇళ్లలో బతుకుదెరువు సాగిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కుమారులు దాడి చేసి, ధూషించారని తెలిపారు. అధికారులకు, పోలీసులకు ఈ విషయాన్ని చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని, చివరికి కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చి గోడును వెళ్లబోసుకంటే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


