వైభవంగా విమాన రథోత్సవం
మర్కూక్(గజ్వేల్): మండలంలోని పాములపర్తిలో సీతా సమేత రామచంద్రమూర్తి విమాన రథోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ వ్యవస్థాపకుడు హన్మంతారావు ఆధ్వర్యంలో సుప్రభాతసేవ, మహ పట్టాభిషేకం, మంగళహరతి, అనంతరం మహారథోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో ఎంపీపీ మాజీ అధ్యక్షుడు పాండుగౌడ్, మండల బీఆర్‌ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో లక్ష్మణ్ గుప్త, శ్యాంసుందర్ గుప్త, గ్రామస్తులు పాల్గొన్నారు.
ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
కొమురవెల్లి(సిద్దిపేట): సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని మహదేవ్ స్వామి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మట్లాడారు. ఆది జగద్గురు రేణుకాచార్య జయంతి సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర తోపాటు తెలంగాణ నుంచి సుమారు 1000 మందితో ప్రారంభమైన మహా పాదయాత్ర కొమురవెల్లికి చేరుకోవడం సంతోషకరమన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాకలో సోమనాథ స్వయంభు లింగ దర్శనంతో పాదయాత్ర ముగుస్తుందన్నారు. గో సంరక్షణకు నడుంబిగించాలన్నారు. మనిషికి ధ్యానంతోనే ప్రశాంతత లభిస్తుందని సూచించారు. అంతకు ముందు పాదయాత్రగా వచ్చిన భక్తులు కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, అర్చక ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది: డీఈఓ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో బి.నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సమావేశం స్థానిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులను నైపుణ్యం కల్గిన పౌరులుగా, దేశ భవిష్యత్ నిర్మాతలుగా తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయ పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా మానిటరింగ్ అధికారి రామస్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేశ్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకం..
పెను ప్రమాదం
హుస్నాబాద్: ప్లాస్టిక్ వాడకం మానవాళికి పెను ప్రమాదమని టాస్క్ టెక్నికల్ ట్రైనర్ హేమంత్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్, అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సంయుక్తంగా విద్యార్థులకు ప్లాస్టిక్ ముప్పుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హేమంత్‌కుమార్ మాట్లాడుతూ నిత్యజీవితంలో వాడే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలు పాడైనప్పుడు వాటిని ‘ఈ వేస్ట్’గా పరిగణిస్తామన్నారు. ఈ పరికరాలను సరైన విధంగా డిస్పోజ్ చేయకుంటే మానవాళికి తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందన్నారు. ‘ఈ వేస్ట్’ను పాడేయకుండా నిర్దేశిత క్రమ పద్ధతిలో రీసైకిల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ అనిల్ కుమార్, అధ్యాపకులు ఉన్నారు.
వైభవంగా విమాన రథోత్సవం
వైభవంగా విమాన రథోత్సవం
వైభవంగా విమాన రథోత్సవం


