ఉత్తమ ఫలితాలు సాధించాలి
పదో తరగతి విద్యార్థులకు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి సూచన
కొండపాక(గజ్వేల్)/గజ్వేల్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనపై విద్యార్థులు దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కుకునూరుపల్లి మండలం మాత్‌పల్లి, హనుమాన్‌నగర్, కోనాయిపల్లి, వడ్డెర కాలనీ, కాశీనగర్, కోలోనివంపు, రామునిపల్లి, పీటీ వెంకటాపూర్‌లో.. అలాగే.. గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి పదోతరగతి కీలకమని చెప్పారు. భవిష్యత్‌లో రాణించడానికి ఇది తొలిమెట్టు అవుతుందని చెప్పారు. విద్యార్థుల్లో చదవడం, రాయడంతో పాటు గణిత భావాలు పెంపొందేలా కృషి చేసుకోవాలని సూచించారు. జాతీయ విద్యా సర్వేలో భాగంగా ఫిబ్రవరిలో జరిగే ప్రతీ పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో విద్యారంగ తీరును గుర్తిస్తారన్న విషయాన్ని ఉపాధ్యాయులు మర్చిపోవద్దన్నారు. ఎఫ్‌ఎల్‌ఎస్ ఫౌండేషన్ లర్నింగ్ స్టడీపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. టెన్త్‌లో ర్యాంకు సాధించడం ద్వారా తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు.


