పాఠశాలల బలోపేతం అవశ్యం
● జనగామలో 28, 29న రాష్ట్ర విద్యా సదస్సు ● యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన జరగాలంటే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి అన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29న జనగామలో నిర్వహిస్తున్న రాష్ట్ర విద్యా సదస్సు, విస్తృత్త స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్ర సమావేశాలకు సంబంధించిన ల్‌పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, యూటిఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సదస్సు సందర్భంగా ఒక నివేదికను సమర్పిస్తామన్నారు. రాష్ట్ర విద్యా సదస్సుకు వక్తలుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ హాజరవుతున్నారన్నారు. ముఖ్య అతిథులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయితీరాజ్ మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లు హాజరవుతారన్నారు. ఈ సదస్సును సిద్దిపేట జిల్లాలోని ఉపా ధ్యాయులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ మండల విద్యాధికారి రాజిరెడ్డి, కొమరవెల్లి మండల విద్యాధికారి రవీందర్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తుడుం శివలింగం తదితరులు పాల్గొన్నారు.


