నేడు మంత్రి వివేక్ రాక
దుబ్బాక: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ బుధవారం దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో నియోజకవర్గంలో మంత్రి పర్యటనల్లో చోటుచేసుకున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు బందోబస్తు చేశారు. దౌల్తాబాద్, చేగుంట మండల కేంద్రాల్లో మంత్రి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చేగుంటలోని రైతు వేదికలో, దౌల్తాబాద్‌లోని వీఆర్‌ఆర్ గార్డెన్‌లో 11 గంటలకు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సన్మానించనున్నారు.


