కామన్ డైట్ మెనూ పాటించాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం కస్తూరిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పిల్లల ఆట వసువులను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. చదువు విషయంలో రాజీ పడవద్దని, ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు సూచించారు. అదనపు తరగతి గదులు కావాలని టీచర్‌లు కొరగా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.


