నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో పాఠ్యాంశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సన్నాహక సమావేశాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. 208 ప్రాథమిక మండల స్థాయి ఉపాధ్యాయులకు స్థానిక ఇందిరానగర్ ఉన్నత పాఠశాలలో, 438 మంది గణిత, 352 మంది ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే 57 స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇర్కోడ్‌లో, 410 మంది సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిద్దిపేటలో, 22 మంది ఉర్దూ ఉపాధ్యాయులకు నాసర్‌పుర పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు రెండు విడతలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రాథమిక స్థాయిలో శిక్షణ పొందిన మండల రిసోర్స్ పర్సన్ లు ఈనెల 20నుంచి మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలలో జిల్లాలోని అందరూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. సమావేశంలో క్వాలిటీ కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అందరూ విధిగా హాజరు కావాలి
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి


