రాజకీయాలు.. మలుపులు | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలు.. మలుపులు

Dec 31 2025 9:54 AM | Updated on Dec 31 2025 9:54 AM

రాజకీ

రాజకీయాలు.. మలుపులు

ఏడాదంతా రసవత్తరం

సాక్షి, సిద్దిపేట: ఏడాదంతా రాజకీయాలు రంజుగా సాగాయి. కీలక మలుపులు చోటుచేసుకున్న 2025 సంవత్సరానికి జిల్లా చరిత్రలో ప్రత్యేకంగా గుర్తిండిపోనుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు దారులు అత్యధిక సర్పంచ్‌ స్థానాలు సాధించి బీఆర్‌ఎస్‌ కంచుకోట అని మరోసారి నిరూపించుకున్నారు. గతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్‌ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు రెండు బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల జిల్లా సారఽథులను నియమించారు. దుబ్బాక నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్‌ నేతలకు మార్కెట్‌ పదవులు దక్కాయి. మొత్తానికి ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన 2025 ఏడాది జిల్లాపై ప్రత్యేక ముద్ర వేసింది.

జిల్లాలో 508 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు, 4,508 వార్డు సభ్యులకు మూడు విడతలలో డిసెంబర్‌ 11, 14, 17వ తేదీలలో ఎన్నికలు జరిగాయి. వీటిలో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 266, కాంగ్రెస్‌కు చెందిన వారు 171, బీజేపీ 21, ఇండిపెండెట్లు 50చోట్ల గెలుపొందారు. జిల్లాలో అత్యధికంగా బీఆర్‌ఎస్‌ మద్దతు దారులు గెలుపొంది సత్తాను చాటారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ పార్టీ మద్దతు దారులు ఎక్కువ సంఖ్యలో సర్పంచ్‌ స్థానాలను దక్కించుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం

ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగిన కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా బీజేపీ మద్దతు దారులు విజయం సాధించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా చిన్నమైల్‌ అంజిరెడ్డి, టీచర్స్‌ ఎమ్మెల్సీగా కొమురయ్యలు గెలుపొందారు. ఈ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులను బరిలో ఉన్న వారు ఈ ఓట్లకు డబ్బులను జోరుగా పంపిణీ చేశారు. ఈ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే ఎన్నికలను తలపించాయి.

డీసీసీ అధ్యక్షురాలిగా..

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం దాదాపు 127 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీసీసీ పదవిని ఆశించిన వారి దరఖాస్తులను ఏఐసీసీ పరిశీలకులు జ్యోతి రౌటేలా, పీసీసీ నుంచి జగదేశ్వరరావు, నజీర్‌ హుస్సేన్‌లు పరిశీలించి ఆశావహులతో నేరుగా సమావేశాలు నిర్వహించారు. తర్వాత ఏఐసీసీకి మూడు పేర్లను సూచించగా అందులో నుంచి తూంకుంట ఆంక్షారెడ్డిని ఎంపిక చేసి నవంబర్‌ 22న ప్రకటించారు. రాష్ట్రంలో అఽధికారంలో ఉన్నప్పటికీ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు వెంటాడుతోంది.

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా..

బీజేపీ జిల్లా అధ్యక్షునిగా శంకర్‌ ముదిరాజ్‌ను ఫిబ్రవరి 18న పార్టీ అధిష్టానం ప్రకటించింది. బీజేపీలో మూడు వర్గాలు విడిపోయారు. మోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డిల వర్గీయులు జిల్లా కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు అంతంతమాత్రంగానే హజరవుతున్నారు. జిల్లా అధ్యక్షున్ని నియమించి 10 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లా కార్యవర్గాన్ని నియమించలేదు. జిల్లా పరిధిలో ఇద్దరు ఎంపీలు బీజేపీకి చెందిన వారు ఉన్నప్పటికీ కేవలం 21 చోట్లనే సర్పంచ్‌లు గెలుపొందారు.

‘స్థానిక’ంగా సత్తా చాటిన బీఆర్‌ఎస్‌

గతం కంటే ఎక్కువ సర్పంచ్‌ స్థానాలు

గెలుపొందిన కాంగ్రెస్‌

వికసించని కమలం

కాంగ్రెస్‌, బీజేపీ

జిల్లా సారఽఽథుల నియామకం

వరించిన నామినేట్‌ పదవులు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేట్‌ పదవులు కొందరి కాంగ్రెస్‌ నాయకులను వరించాయి. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌ మార్కెట్‌ కమిటీలను, కొమురవెల్లి దేవాలయ కమిటీ నవంబర్‌ 24న నియమించారు. పల్లె ఎన్నికల వేళ స్థానిక నేతలకు తీపి కబురు అందింది. సిద్దిపేట నియోజకవర్గంలో మార్కెట్‌ పదవుల్లో నియమించకపోవడంతో కాంగ్రెస్‌ నేతలు నిరాశలో ఉన్నారు. రెండేళ్లుగా సిద్దిపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకులు నామినేట్‌ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

రాజకీయాలు.. మలుపులు1
1/3

రాజకీయాలు.. మలుపులు

రాజకీయాలు.. మలుపులు2
2/3

రాజకీయాలు.. మలుపులు

రాజకీయాలు.. మలుపులు3
3/3

రాజకీయాలు.. మలుపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement