ముక్కోటి.. తరించిన భక్తకోటి
ఉత్తరద్వారంలో స్వామివారు దివ్యదర్శనం
● గోవిందనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
● పుణ్యక్షేత్రాల్లో వెల్లువెత్తిన ఆధ్యాత్మికత
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పుణ్య క్షేత్రాలు ‘ముక్కోటి’ వైభవంతో అలరారాయి. ముక్కోటి ఏకాదశిని మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు. స్వామి వారి పల్లకీ సేవ చేపట్టారు. మోహినిపుర ఆలయంలో కలెక్టర్ హైమావతి, న్యాయమూర్తులు, మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతులు, సినీ హిరో సంపూర్ణేష్‌బాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ నిర్వాహకులు సన్మానాలు చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులు ఆలయాలకు భారీగా తరలిరావడంతో అన్ని ఆలయాలు కిటకిటలాడాయి. స్వామి వారి దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.


