పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయండి
గజ్వేల్‌రూరల్: ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ సూచించారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, క్రియాశీలక నాయకుల సమావేశాన్ని పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బూటకపు హామీలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎల్లు రాంరెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్


