నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు

Sep 23 2026 8:33 AM | Updated on Sep 23 2026 8:33 AM

ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌

నారాయణఖేడ్‌: ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనాలు జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ పేర్కొ న్నారు. మనూరు మండలం కమలాపూర్‌ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను డీఎస్పీ వెంకట్‌రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...నిమజ్జనంసందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చెరువుల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాట్లు చేశామన్నారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో రోడ్ల పరిస్థితి, మరమ్మతులు, నిమజ్జనం ప్రాంతంలో బారికేడ్లు, లైటింగ్‌, పారిశుద్ధ్య ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. ఎస్పీ వెంట సీఐ శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలువురు అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement