అమీన్‌పూర్ పట్టణంలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్‌పై మూతల లేకపోవడంతో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ప్రమాద హెచ్చరికలుగా స్థానికులు ఆ తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌ల వద్ద కర్రలు, రాళ్లు పెడుతున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోను అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలు ప్రమాదకరంగా ఉన్నాయి. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ సొంతూరులో పరిస్థితి ఇది. కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయం సమీపంలో అమీన్‌పూర్‌లో మ్యాన్‌హోల్స్‌పై మూతలు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. –పటాన్‌చెరు


