జహీరాబాద్: గ్రామ పర్యావరణ సమస్యలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్‌జీటీ)ని ఆశ్రయించినట్లు బూర్దిపాడ్ ప్రజలు పేర్కొన్నారు. మండలంలోని తమ గ్రామ సరిహద్దుగా ఉన్న కొత్తూర్(బి) గ్రామంలో గల రసాయన పరిశ్రమ మూలంగా కలుగుతున్న సమస్యలపై చైన్నెలోని సదరన్ జోన్, ఎన్‌జీటీని ఆశ్రయించినట్లు తెలిపారు. పలు సంస్థలు, వ్యక్తులను ఇందులో ప్రతివాదులుగా చేర్చినట్లు వెల్లడించారు. వాయు, జల కాలుష్యం కారణంగా పర్యావరణం దెబ్బతింటోందని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వారు వాపోయారు.
హైదరాబాద్ సీఆర్‌డీ కార్యాలయ అధికారి అనురాధ
మునిపల్లి(అందోల్): అభివృద్ధి కార్యక్రమాల్లో పిల్లోడి గ్రామం జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తుందని హైదరాబాద్ సీఆర్‌డీ కార్యాలయ అధికారి అనురాధ పేర్కొన్నారు. మండలంలోని పిల్లోడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ డప్పు సువర్ణ మాజీ సర్పంచ్ సతీశ్ కుమార్, ఉపసర్పంచ్ రవిశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎన్ని రకాల పనులున్నాయో అన్ని రకాల పనులను నిర్వహించడానికి జిల్లా అధికారులు పిల్లోడి గ్రామాన్ని రోల్ మాడల్‌గా తీర్చిదిద్దడానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. వ్యవసాయ భూములకు లింక్ రోడ్లు, చెక్‌డ్యామ్‌లు, ఫామ్‌పాండ్ పనులు, ఇంకుడు గుంతలు, బావుల ఏర్పాటుతోపాటు తదితర పనులను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ అదనపు పీడీ బాల్‌రాజ్, పూజ, ఎంపీడీఓ అంజయ్య, ఎంఈఓ భీమ్‌సింగ్, ఏపీఓ యాదగిరి, ఏఓ, టీఏ గ్రామస్తులు పాల్గొన్నారు.
కూల్చివేతల పర్యవేక్షణ
జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో రహదారుల విస్తరణ సందర్భంగా అక్రమ కట్టడాలను యజమానులు స్వచ్ఛందంగా కూల్చివేసుకుంటున్నారు. మంగళవారం భవానీ మందిర్, హనుమాన్‌మందిర్, లతీఫ్ రోడ్లను కమిషనర్ జి.ప్రభాకర్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్‌రావు, టీపీఎస్ మంజు భార్గవి సందర్శించారు. ఈ సందర్భంగా మార్కింగ్ ఇచ్చిన మేర కూల్చివేతలు జరుగుతున్నదీ లేనిది పరిశీలించారు.
డీసీసీ అధ్యక్షుడికి సన్మానం
న్యాల్‌కల్ (జహీరాబాద్): డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డిని మంగళవారం న్యాల్‌కల్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కాకిజన్‌వాడ సర్పంచ్ లక్ష్మారెడ్డి, నాయకులు రాములు, జైపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు ఉదయం నారాయణఖేడ్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తాం: సంజీవరెడ్డి
కల్హేర్(నారాయణఖేడ్): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ నిరుపేదకు చేరేలా చూడటమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని మాసాన్‌పల్లి, దేవునిపల్లిలో లబ్ధిదారులకు స్మార్టు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.


