పటాన్‌చెరు: ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత వారిపై ఉందని అదనపు కలెక్టర్ పాండు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవానికి జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదు మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ..విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. 25 ఏళ్లుగా గురుపూజోత్సవాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని అభినందించారు. డీఈఓ రోహిణి మాట్లాడుతూ..విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ..మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి.
అదనపు కలెక్టర్ పాండు


