పాతకక్షలే కారణం
సంగారెడ్డి క్రైమ్: ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమానాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నాల్‌సాబ్‌గడ్డకు చెందిన మహమ్మద్ ఫాజిల్(43) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కంది గ్రామానికి చెందిన మహమ్మద్ రహీం, మహమ్మద్ బిలాలు మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో మద్యం సేవించారు. పాత కక్షలతో పగ పెంచుకున్న రహీం.. స్థానిక అంబేడ్కర్ గ్రౌండ్ వెనకాల జలాల్‌బాగ్ ప్రాంతంలో ఫాజిల్‌ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఫాజిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫాజిల్ అన్న హాజీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితుడు
సీసీ కెమెరాల ఆధారంగా, సాంకేతికతను ఉపయోగించి 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.


