డ్రాపౌట్స్‌ తగ్గి... రెట్టింపైన పిల్లలు | - | Sakshi
Sakshi News home page

డ్రాపౌట్స్‌ తగ్గి... రెట్టింపైన పిల్లలు

Sep 5 2026 7:25 AM | Updated on Sep 5 2026 7:25 AM

గిరిజన తండాలోని ఉపాధ్యాయుడి కృషి

పుల్‌కల్‌(అందోల్‌)ః విధుల పట్ల నిబద్ధత కలిగిన ఓ ఉపాధ్యాయుడు గిరిజన తండాల్లోని విద్యార్థుల్లో వెలుగులు నింపాడు. మారుమూల గిరిజన తండాల్లో డ్రాపౌట్స్‌ తగ్గించి గిరిజన విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా కృషి చేశాడు. మండల పరిధిలోని గొంగ్లూర్‌ గిరిజన తండాలో విద్యాబోధన చేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ డ్రాపౌట్‌ తగ్గించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేశారు. 800 వందల జనాభా కలిగిన గొంగ్లూర్‌ గిరిజన తండాలోని విద్యార్థులు తండాలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా ప్రైవేటుకు మొగ్గుచూపే వారు. మరికొందరు ఇంటి వద్ద చిన్న పిల్లలను ఆడిపించేవారు. 5 తరగతుల వరకు ఉన్న ఆ పాఠశాలలో 2024 వరకు కేవలం 24 మంది విద్యార్థులుండేవారు. కానీ ప్రవీణ్‌ కుమార్‌ ఆ పాఠశాలకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలను గిరిజనుల సహకారంతో బాగుచేసి విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లికుండా కట్టడి చేశారు. మెరుగైన విద్యా బోధన చేసి మూడేళ్లలో డ్రాపౌట్స్‌ తగ్గించి విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేశారు. ఇప్పుడు మారుమూల గిరిజన తండాలోని పాఠశాలలో 30 మంది బాలురు,16 మంది బాలికలు విద్యాబోధన చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయుడి కృషి వల్ల పాఠశాలలో మార్పు కనిపించి డ్రాపౌట్‌లను నివారించామని తండా సర్పంచ్‌ సురెందర్‌ తెలిపారు. స్వచ్చంద సంస్థల సహకారంతో పాఠశాలలో మెరుగైన విద్యాబోధన జరుగుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement