శివ్వంపేట(నర్సాపూర్): మద్యానికి బానిసై ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుకర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగన్న గారి మహేశ్(50) ఆటో డ్రైవర్‌గా జీవనోపాధి పొందుతున్నాడు. కొంత కాలంగా అతడు మద్యానికి బానిసై అప్పులు చేశాడు. దీంతో నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో పలుమార్లు పెద్దలు నచ్చజెప్పినా అతనిలో మార్పు రాలేదు. గురువారం రాత్రి బాత్రూమ్‌కు వెళ్తున్నానని తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఇనుపరాడ్‌కు ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందాడు.


