జహీరాబాద్ టౌన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం వంటలు, ముగ్గులు, మెహిందీ పోటీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై పోటీలను ప్రారంభించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన వంటల ప్రాముఖ్యతను సమాజంలో తెలియపరచాలన్నారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన 117 మంది విద్యార్థులు చిరుధాన్యాలతో ఘుమఘుమలాడే వంటలను తయారు చేసి ప్రదర్శించారు. అలాగే ముగ్గులు, మెహిందీ, వ్యాసరచన, దేశభక్తి పాటల పోటీలు కూడా నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్.హరికుమార్, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు


