వర్గల్(గజ్వేల్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక డిజిటల్ సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ డాక్టర్ బాలకిష్టారెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గౌరారం కావేరి విశ్వవిద్యాలయంలో ‘అభ్యుదయ–2026’ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కావేరి వర్సిటీ చాన్స్‌లర్, కావేరి సీడ్స్ చైర్మన్ జీ.వీ.భాస్కర్‌రావు, మణిపూర్ వర్సిటీ చాన్స్‌లర్, తిరుపతి రావు, కావేరి వీసీ ప్రవీణ్‌రావుతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మారుతున్న వృత్తి ప్రపంచాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆవిష్కరణాత్మక, విమర్శనాత్మక ఆలోచనా విధానం, సమస్య పరిష్కార నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలన్నారు. జీ.వీ.భాస్కర్‌రావు మాట్లాడుతూ కావేరి వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఆరోగ్యం, రిజిస్ట్రార్ డాక్టర్ బీ.శ్రీనివాసులు, డైరెక్టర్ హర్షరావు, డీన్లు, ఈడీలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి
చైర్మన్ బాలకిష్టారెడ్డి


