క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చాటాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చాటాలి

Aug 15 2026 7:23 AM | Updated on Aug 15 2026 7:23 AM

డీఎస్‌వైఓ వీరారెడ్డి

సిద్దిపేటజోన్‌: క్రీడల్లో నైపుణ్యాలను సాధించి ఉత్తమ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో రాణించి సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా క్రీడల , యువజన శాఖ అధికారి వీరారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైదానంలో అండర్‌ –15 జూనియర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపిక క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆట ఫుట్‌బాల్‌ అని అభివర్ణించారు. మంచి ఫిట్‌నెస్‌ సాధించాలని క్రీడాకారులకు సూచించారు. జిల్లా జట్టులో అక్షిత్‌, వర్షిత్‌, అక్షిత్‌ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గణేశ్‌, ప్రతినిధులు సాజిద్‌, కోచ్‌ అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement