న్యాల్‌కల్(జహీరాబాద్): ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను రైతులకు అందించడమే డిజిటల్ వ్యవసాయ పైలెట్ ప్రాజెక్ట్ ఉద్దేశమని ముంబై ఎస్‌బీఐ పౌండేషన్ అధికారులు అర్పిత శర్మ, ఎస్‌బీఐ ఏఆర్‌ఐఎస్‌ఏ ల్యాబ్ ప్రాజెక్ట్ హెడ్ జెల్ల సత్యనారాయణ అన్నారు. మండల పరిధిలోని గంగ్వార్‌లో నిర్వహిస్తున్న డిజిటల్ వ్యవసాయ పైలెట్ ప్రాజెక్ట్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిజిటల్ వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్‌గా గంగ్వార్‌ను ఎంపిక చేశామని, ఇక్కడ విజయవంతమైతే క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. రోబోటిక్ ద్వారా కలుపు తీత, చీడ పీడల నివారణ, వర్షం తదితర సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం వంటి వివరాలను వివరించారు. కార్యక్రమంలో బసంత్‌పూర్–మామిడ్గి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్, నారింజ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గంగ్వార్‌లో డిజిటల్ వ్యవసాయ
పైలెట్ ప్రాజెక్ట్ సందర్శన


