పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ కేసులు
పటాన్‌చెరు టౌన్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం 809 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రమాదాల ముప్పు అధికంగా ఉండటంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రతి రోజు తనిఖీలు చేపడుతూ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని గుర్తిస్తున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో మద్యం తాగినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తున్నారు.
ఆగస్టు వరకు 809 కేసులు
పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 809 కేసులు నమోదు కాగా, 653 కేసులను కోర్టుకు పంపించారు. విచారణ అనంతరం ఇప్పటివరకు 39 మందికి జైలు శిక్ష పడింది. అలాగే 653 కేసుల్లో మొత్తం రూ.8,63,500 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాగిన తర్వాత ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను వినియోగించాలని సూచిస్తున్నారు.
జనవరి నుంచి ఆగస్టు వరకు 809 కేసులు
653 కేసులు కోర్టుకు.. 39 మందికి జైలు శిక్ష
రూ.8,63,500 జరిమానా


