చేర్యాల(సిద్దిపేట): కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వి.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ నెల 2 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర మంగళవారం మండలంలోని చుంచనకోట గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా యాత్రకు కల్లుగీత కార్మికులు స్వాగతం పలికి అనంతరం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీతన్నల పెన్షన్ రూ.4వేలకు పెంచుతామని, ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు చేసి నెల రోజుల లోపే ఇస్తామని ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల చొప్పున భూమి ఇచ్చి, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. ఆగస్టు 18 వరకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యాత్ర బృందం గోపి, వెంకట మల్లయ్య, వెంకన్న, చంద్రయ్య, అచ్చాలు, కరుణాకర్, ఉప్పలయ్య, బాల్‌నారాయణ, నాగేశ్వరరావు, సుధాకర్, జగన్, రాజేశ్, నవీన్, కౌన్సిలర్ ప్రసాద్, నాయకులు నర్సింహులు, కనకయ్య, సత్తయ్య, గణేశ్, క్రాంతి, సురేశ్, సిద్ధిరాములు, రాములు, సంజీవులు, అంజయ్య, వెంకటేశ్, మల్లేశం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చేర్యాలకు చేరిన గీతన్నల చైతన్య యాత్ర


