చెక్కబొమ్మల కళాకారులకు చేయూత | - | Sakshi
Sakshi News home page

చెక్కబొమ్మల కళాకారులకు చేయూత

Aug 12 2026 8:00 AM | Updated on Aug 12 2026 8:00 AM

చెక్కబొమ్మల కళాకారులకు చేయూత

జహీరాబాద్‌ టౌన్‌: చెక్కబొమ్మల కళాకారులకు ప్రభుత్వం చేయూత ఇవ్వనుందని సెర్ప్‌ పీఎం నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరంలో చెక్కబొమ్మల కళాకారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాగరాజు మాట్లాడుతూ.. చెక్కబొమ్మల తయారీదారులను గుర్తించేందుకు అలైఫ్‌ సంస్థ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 200 మందికి ఉపాధి కల్పించేందుకు జిల్లాలో యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణం తదితర వసతులు కల్పిస్తామని, ఈ మేరకు రూ.కోటి మంజూరు అయ్యాయన్నారు. బొమ్మల తయారీ, మార్కెటింగ్‌ తదితర విషయాలపై శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సెర్ప్‌ కన్సల్టెంట్‌ ఇందు, అలైఫ్‌ ప్రతినిధులు మాధవి, డీపీఎం రమేశ్‌బాబు, ఏపీఎంలు విశేశ్వర్‌గౌడ్‌, బాగయ్యకుమార్‌, సీసీలు, వీఓఏలు, మెప్మా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement