రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ సురేశ్ షెట్కార్
జహీరాబాద్: హైదరాబాద్–ముంబై బుల్లెట్ రైలును యథాతధంగా జహీరాబాద్ మీదుగానే నడపాలని ఎంపీ సురేశ్ షెట్కార్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు మంగళవా రం ఢిల్లీలో కేంద్ర మంత్రితో ఎంపీ సురేశ్ షెట్కార్ భేటీ అయ్యి వినతి పత్రం సమర్పించారు. ఢిల్లీ–హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను మొదట ప్రతిపాదించిన విధంగానే సంగారెడ్డి, జహీరాబాద్, షోలాపూర్ మీదుగా కొనసాగించాల ని రైల్వే మంత్రిని కోరారు. ఇటీవల కాలంలో ఈ రూట్‌ను తాండూరు, వికారాబాద్‌ల మీదుగా మళ్లించడానికి వస్తున్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని షెట్కార్ మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ సిద్ధం చేసిన ప్రాథమిక సమ గ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) ప్రకారమే అసలు రూట్‌కు కట్టుబడి ఉండాలని మంత్రిని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మూడు కారణాలను సైతం వివరించినట్లు తెలిపారు.


