● జిల్లాలో పెరిగిన మిస్సింగ్ కేసులు ● దొరకని తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ
సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి జిల్లాలో 33 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై వరకు 416 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డి, పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌న్‌లలో కేసులు అవుతున్నాయి. ఎక్కువగా మిస్సింగ్ కేసుల్లో ఒంటరి మహిళలు, విద్యార్థినులు, ఐటీ ఉద్యోగులు, వృద్ధులు ఉంటున్నారు. దీంతో పోలీసులకు వారి ఆచూకీ గుర్తించడం కష్టంగా మారుతోంది.
జిల్లాలో పరిశ్రమలు విస్తరించడం వల్ల ఇతర రాష్ట్రాలకు చెందినవారు తమ గ్రామాల్లో ఉపాధి కరువై జిల్లాకు వలస వస్తున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ పట్టణానికి వచ్చే ఒంటరి మహిళలు, పిల్లలు, వృద్ధులు తమ వారి జాడ తెలియక అనాథలుగా మారుతున్నారు. కుటుంబ కారణాలతో ప్రేమ విఫలమై, ఒత్తిడి, ఉద్యోగం(జాబ్) లేక మరికొందరు అదృశ్యమవుతున్నారు.
24 గంటల్లో కేసు నమోదు చేస్తే..
అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలను ఉపయోగించి పోలీస్ అధికారులు చాలా వరకు 24 గంటల్లోనే మిస్సింగ్ కేసులను చేధిస్తున్నా.. మరికొందరి ఆచూకీ మాత్రం ఏళ్లు గడుస్తున్నా అంతు చిక్కడం లేదు. మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే కేసుల వివరాలు కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.
పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ వివరాల బోర్డు


