భక్తులతో కిటకిటలాడిన ఆలయం
పటాన్‌చెరు టౌన్: ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా పటాన్‌చెరు శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బోనాలు ఎత్తుకుని భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు అమ్మవారిని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు మహేశ్ తెలిపారు.


