మెదక్‌జోన్: అండర్–17 బాలికల ఫుట్‌బాల్ రాష్ట్రస్థాయిలో మెదక్ ద్వితీయ స్థానంలో నిలిచిందని ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు శనివారం తెలిపారు. మెదక్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) తరపున తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ తరపున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 బాలికల ఫుట్‌బాల్ కప్ పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించిందన్నారు. ఫైనల్‌లో రంగారెడ్డి జిల్లా జట్టుతో తలపడి 2–0 స్కోర్‌తో రన్నరప్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జట్టు కోచ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బొల్లం సత్తయ్య (55) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఢిల్లీ లోని ఆస్పత్రిలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుమారు 30 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో పని చేసిన సత్తయ్య ఢిల్లీలో ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అనారోగ్యానికి గురికాగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
పేకాట రాయుళ్ల అరెస్టు
జహీరాబాద్ టౌన్: పేకాట ఆడుతున్న నలుగురిని జహీరాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ ఎస్‌ఐ.రాజేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని అర్జున్ నాయక్ తండాలో కొంత మంది పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు పోలీసులు దాడి చేయగా పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వీరి నుంచి రూ.4,050 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం నేరమని, ఎక్కడైనా జూదం ఆడుతున్నట్లు తెలిసినట్లయితే 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
గంజాయి స్వాధీనం
చిన్నశంకరంపేట(మెదక్): మెదక్ ఎకై ్సజ్ డీటీఎఫ్ అధికారులు ఎండు గంజాయితో పాటు గంజాయి చాక్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా.. డీటీఎఫ్ బృందం శుక్రవారం అర్ధరాత్రి నార్సింగిలో తనిఖీలు చేపట్టారు. బీహర్‌కు చెందిన శివ్‌కుమార్ సాడ హమాలీగా పనిచేస్తూ తోటి కార్మికులకు గంజాయి విక్రయిస్తూ, అక్రమంగా మత్తుపదార్థాలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 2 కిలోల గంజాయి, 150 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీటీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జే.గోపాల్ తెలిపారు. ఎస్‌ఐ బాలయ్య, కానిస్టేబుళ్లు వహిద్, జీవన్, పుండరీకం, స్రవంతి పాల్గొన్నారు.


