మల్టీ జోన్ –1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి
తూప్రాన్: జాతీయ రహదారి–44పై నిఘాను మరింత పటిష్టం చేయాలని మల్టీ జోన్ –1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ టోల్‌గేట్ వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల నిఘా, అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్) పనితీరును పరిశీలించారు.
రహదారిపై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఏటీఎంఎస్‌లోని ట్రాఫిక్ మానిటరింగ్ కెమెరాలు, వాహన వేగాన్ని గుర్తించే వీఏఎస్‌డీ రాడార్ ఆధారిత హెచ్చరిక వ్యవస్థలు, వేరియబుల్ మెసేజింగ్ సైన్‌బోర్డులు తదితర వ్యవస్థలను ఐజీ పరిశీలించారు. అతివేగంగా ప్రయాణించే వాహనాలను గుర్తించి ఈ–చలాన్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీ నరేందర్‌గౌడ్, ఎస్‌ఐ గంగారాజు, టోల్ గేట్ సిబ్బంది పాల్గొన్నారు.


