జహీరాబాద్: ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకుని 65వ జాతీయ రహదారిపై దిగ్వాల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు సూచించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో మాణిక్‌రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్ సమావేశమయ్యారు. అనంతరం దిగ్వాల్ గ్రామాన్ని సందర్శించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సిన విధానంపై పరిశీలించారు. అండర్ పాస్ విషయంలో పస్తాపూర్ వద్ద నిర్మించిన విధంగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసి పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం.శివకుమార్, బీఆర్‌ఎస్ నాయకులు తట్టు నారాయణ, వెంకటేశం, సంగమేశ్వర్, నర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో ఎమ్మెల్యే మాణిక్‌రావు


