రోడ్ల విస్తరణకు లైన్‌ క్లియర్‌ | - | Sakshi
Sakshi News home page

రోడ్ల విస్తరణకు లైన్‌ క్లియర్‌

Aug 8 2026 8:43 AM | Updated on Aug 8 2026 8:43 AM

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ పట్టణంలోని ఇరుకు రోడ్లలో ట్రాఫిక్‌ కష్టాలు తొలగనున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రోడ్లను విస్తరించనున్నారు. ఈ మేరకు మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలోని భవానీ మందిరం, హనుమాన్‌ మందిరం వీధి రోడ్లను ముందుగా 40 అడుగులకు విస్తరించనున్నారు. ఈ మేరకు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం సర్వే నిర్వహించారు. కౌన్సిల్‌ సమావేశంలో రోడ్డు విస్తరణకు అనుకూలంగా తీర్మానం చేశారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు కూడా రోడ్డు వెడల్పుకు అంగీకారం తెలిపారు. విస్తరణలో భాగంగా తాజాగా రోడ్డు వెంబడి ఉన్న దుకాణాల యాజమా నులకు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. రోడ్డు విస్తరణ పనులు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.

మాస్టర్‌ ప్లాన్‌ అమలు

జహీరాబాద్‌ పట్టణంలో సుమారు 1.25 లక్షల జనాభా ఉంది. 24 వార్డు ఉండగా ఐదు పంచాయతీలు విలీనంతో 37 వార్డులకు చేరుకుంది. 21.14 చదరపు కిలోమీటర్ల మేరకు పట్టణం విస్తరించింది. అమృత్‌ 2.0 పథకం కింద జహీరాబాద్‌ పట్టణాన్ని మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయడానికి 2024లో నిర్ణయించారు. పట్టణంలోని భవానీ మందిరం, హనుమాన్‌ మందిరం, లతీఫ్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లే రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. ఆయా రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోడ్లను 40 అడుగుల వెడల్పు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కొన్ని కారణాల వల్ల ఇనాళ్లు జాప్యం జరింగింది. అన్ని రాజకీయ పార్టీల నాయకులతోపాటు కౌన్సిల్‌ కూడా తీర్మానం చేయడంతో రోడ్ల విస్తరణకు మార్గం సుగమమైంది. దీంతో మున్సిపల్‌ అధికారులు రోడ్ల కొలతలు తీసుకుని 40 ఫీట్ల రోడ్డు కోసం వ్యాపారులకు నోటీసులిస్తున్నారు.

రోడ్డు వెడల్పు కోసం సర్వే

నిర్వహిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

రోడ్డు వెడల్పు కోసం మున్సిపల్‌ అధికారి నిర్వహిస్తున్న సర్వే

తొలగనున్న ట్రాఫిక్‌ ఇబ్బందులు

మాస్టర్‌ ప్లాన్‌ అమలులో అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement