రైలు జనరేటర్‌ బోగీలో మంటలు | - | Sakshi
Sakshi News home page

రైలు జనరేటర్‌ బోగీలో మంటలు

Aug 8 2026 8:43 AM | Updated on Aug 8 2026 8:43 AM

జహీరాబాద్‌: కర్ణాటకలోని బీదర్‌ నుంచి బెంగళూర్‌ మీదుగా యశ్వంత్‌పూర్‌ వెళ్తున్న రైలు (నె.16572) ఇంజన్‌ వెనుక బోగీలో ఉండే జనరేటర్‌ విభాగంలో కొద్దిపాటి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సాంకేతిక సిబ్బంది యంత్రాల సహాయంతో అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకుంది. స్టేషన్‌లోకి రైలు వస్తున్న క్రమంలో స్టేషన్‌ సిబ్బంది పొగలు వస్తుండటం గమనించి రైలు సిబ్బందికి సమాచారం అందించారు. స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత సాంకేతిక సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. అనంతరం రాత్రి 7.25 నిమిషాలకు తిరిగి రైలు బయలుదేరి వెళ్లింది. రైలు నడుస్తున్న సమయంలో మంటలు లేచి ఉంటే కొంత తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేశారు.

మంటలను అదుపుచేసిన సాంకేతిక సిబ్బంది

జహీరాబాద్‌ స్టేషన్‌లో అరగంట పాటు నిలిచిన రైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement