రేవంత్‌రెడ్డిది ప్రచారార్భాటమే | - | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డిది ప్రచారార్భాటమే

Aug 8 2026 8:43 AM | Updated on Aug 8 2026 8:43 AM

రేవంత్‌రెడ్డిది ప్రచారార్భాటమే

బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌

నర్సాపూర్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారే తప్ప ప్రజలకిచ్చిన హామీల అమలులో ఆయన పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ విమర్శించారు. స్థానిక విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ...ప్రధానమంత్రి మోదీ రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తుండగా సీఎం రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. అందరికీ రుణమాఫీ చేయలేదని, ఫసల్‌ భీమా పథకం అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మితేనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులేర్పడ్డాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజారాయని ఆయన ఎద్దేవా చేశారు. రైతు సమస్యలతోపాటు పేద ప్రజల సమస్యలను పరిష్కరించని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మల్లేశ్‌గౌడ్‌ హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ నాయకులు సురేశ్‌, రమేశ్‌గౌడ్‌, ఆంజనేయులుగౌడ్‌, నారాయణరెడ్డి, జిల్లా కిసాన్‌మోర్చా అధ్యక్షుడు సత్యనారాయణ, ఇతర నాయకులు కాశీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement