బీడీఎల్‌లో విద్యార్థుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

బీడీఎల్‌లో విద్యార్థుల పర్యటన

Aug 8 2026 8:43 AM | Updated on Aug 8 2026 8:43 AM

బీడీఎల్‌లో విద్యార్థుల పర్యటన

పటాన్‌చెరు టౌన్‌: ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌, ఏఐడీఎస్‌ విద్యార్థులు భానూర్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)ను సందర్శించి క్షిపణి సాంకేతికతపై ప్రత్యక్ష అవగాహన పొందారు. బీడీఎల్‌ అధికారులు మిలన్‌, కొంకుర్స్‌, ఇన్వర్‌, కొంకుర్స్‌–ఎం ట్యాంక్‌ విధ్వంసక క్షిపణులు, ఆస్ట్రా గగనతల క్షిపణి వ్యవస్థలపై వివరించారు. ఈ పర్యటనలో ప్రొఫెసర్‌ ప్రీతి అంబరీష్‌ పర్వేకర్‌, 30 మంది విద్యార్థులు, ఐదుగురు అధ్యాపకులు పాల్గొన్నారు. బీడీఎల్‌ హెచ్‌ఆర్‌ విభాగాధిపతి గంగయ్య బృందానికి స్వాగతం పలకగా, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు సాంకేతిక నైపుణ్యం, క్రమశిక్షణ ప్రాధాన్యాన్ని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement