శివ్వంపేట(నర్సాపూర్): టీబీ రహిత సమాజంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజన అన్నారు. శుక్రవారం టీబీ ముక్త్‌భారత్ అభియాన్‌లో భాగంగా శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. టీబీకి సంబంధించిన అనుమానిత వ్యక్తులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా స్క్రీనింగ్, ఎక్స్‌రే చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. టీం లీడర్ అవనీష్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్‌సీసీ కెడెట్లు సేవలందించారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు సాయిసౌమ్య, సిబ్బంది ఉన్నారు.


