రామాయంపేట(మెదక్): ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని కేసీఆర్ కాలనీ (డబుల్ బెడ్రూం కాలనీ)కి చెందిన ఽమెక్కొండ ధనుష్, ఆరె మనోజ్, షేక్ సమీర్ స్నేహితులు. వీరు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు 13 ఏళ్లలోపు వారే. ముగ్గురు కలిసి గురువారం రాత్రి కాలనీలో ఆడుకుంటున్న క్రమంలో అదృశ్యమయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంతోపాటు అక్కన్నపేట రైల్వేస్టేషన్ పరిసరాల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎస్‌ఐ బాల్‌రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికై నా వీరి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని స్థానిక సీఐ సైదా సూచించారు.


