నంగునూరు(సిద్దిపేట): ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాజగోపాల్‌పేట మధిర గ్రామం శివాజీ నగర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గౌరబోయిన సంతోష్ (30) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పొలం దున్ని పైకి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. పొలంలో కిందపడ్డ సంతోష్‌పై ట్రాక్టర్ బోల్తా పడడంతో బురదలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరిత, కూతుళ్లు నిత్య, శ్రీఅన్విక ఉన్నారు.


