ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిద్దామని మహిళా జాగరణ సమితి అధ్యక్షురాలు లక్కిరెడ్డి విజయ అన్నారు. సిద్దిపేటలోని వ్యాస మహర్షి యోగా సొసైటీ, మహిళా జాగరణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో గోరింటాకు మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళల సందడి, సంప్రదాయ వస్త్రధారణ, గోరింటాకు అలంకరణలు, కోలాటాలతో కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా లక్కిరెడ్డి విజయ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా విశిష్టమైన సంప్రదాయమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మహిళల్లో ఐక్యతను పెంపొందించి, కుటుంబ విలువలను బలోపేతం చేస్తాయని తెలిపారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఉమారెడ్డి మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే యోగా, భారతీయ సంస్కృతి రెండూ అవసరమన్నారు. కార్యక్రమంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గోరింటాకు మహోత్సవంలో పాల్గొన్న మహిళలు


