హరీశ్‌రావుపై ఆరోపణలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

హరీశ్‌రావుపై ఆరోపణలు సరికాదు

Aug 7 2026 6:28 AM | Updated on Aug 7 2026 6:28 AM

నర్సాపూర్‌: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ తన హోదాను విస్మరించి మాజీమంత్రి హరీశ్‌రావుపై ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే సునీతారెడ్డి హితవు పలికారు. గురువారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ... బీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తారని, మాజీమంత్రి హరీశ్‌రావు తన వ్యక్తిగత పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్తే అక్కడ క్షుద్ర పూజలు చేశారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమైందని విమర్శించారు.

జయశంకర్‌కు నివాళులు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని పురస్కరించుకుని సునీతారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎమ్మెల్యే సునీతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement