పటాన్‌చెరు: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలనీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అభివర్ణించారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ దేవతల బోనాల ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్, కౌన్సిలర్ వెంకటేశ్, ఆంజనేయులు, సీనియర్ నాయకులు నరేందర్‌రెడ్డి, మేరాజ్ ఖాన్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
చిట్కుల్ గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ


